Avika Gor: నేను అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడను: అవికా గోర్

Avika Gor: అవికా గోర్ ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది చిన్నారి పెళ్లి కూతురు సీరియల్. సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికాగోర్ ఆ తరువాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా మారింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. అదే విధంగా ఉయ్యాల జంపాల సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు అందుకుంది. హీరో రాజ్ తరుణ్ తో ఉయ్యాల జంపాల సినిమా చేసి ఆ తరువాత సినిమా చూపిస్తా మావ సినిమాను కూడా చేసింది.

ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మరో హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో తనకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్లామర్ రోల్స్ దూరంగా ఉంటోంది. ఇకపోతే ఇటీవల విడుదల అయిన నెట్ అనే సినిమాలో కాస్త బోల్డ్ గా నటించింది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో అవికాగోర్ కాస్త బొద్దుగా మారింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. బొద్దుగా చూడటానికి చబ్బి లుక్ లోకి మారిపోయింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీపై పలువురు నెటిజన్స్ ట్రోలింగ్స్ చేయగా ఆ విమర్శలకు తనదైన శైలిలో స్పందించింది అవికాగోర్. నన్ను నేను చాలా అసహ్యించుకుంటున్నాను.. నా శరీరాన్ని అంతగా పట్టించుకోలేదు.. అలా అని నేను కూడా బాధ పడలేదు.. నేను నా నటన పై మాత్రమే దృష్టి పెడతాను.. ఎందుకంటే నేను అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడను అంటూ కాస్త ఘాటుగా స్పందించింది.