Actress: మీ నడుము కేక మేడం…. నేటిజన్ కామెంట్ కు షాక్ లో నటి…ఆమె రియాక్షన్ ఇదే!

Actress: సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో మన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ ఒకరు. మల్లేశం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈమె అనంతరం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించి అనన్య మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక అనన్య నటిగా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అలాగే కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతూ ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో నేటిజన్ల నుంచి సెలబ్రిటీలకు చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.

ఇదిలా ఉండగా తాజాగా అనన్య నాగళ్ళ సైతం బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమెను ప్రశ్నిస్తూ మీ జీవితంలో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ కామెంట్ ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పెద్దగా సక్సెస్ కూడా అందుకోలేదు అలాగే ఎలాంటి గ్లామర్ పాత్రల్లో కూడా నటించలేదు.

ఓసారి ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా నేను వెళ్ళాను అయితే అక్కడ ఎంతోమంది ఉన్నారు అందులో ఒక అబ్బాయి అందరిని తోసుకుంటూ నా దగ్గరికి వచ్చి మేడం మీ నడుము చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే ఆ కుర్రాడు అలా చెప్పడంతో నాకు పెద్దగా కోపం రాలేదు కానీ ఆ కాంప్లిమెంట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంటూ అనన్య ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.