Venkat: దేనికీ పనికిరావు అన్నారు: నటుడు వెంకట్

Venkat: తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటుడు వెంకట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట సీతారాముల కల్యాణం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు వెంకట్. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. వెంకట్ నటించిన అన్నయ్య సినిమా అతనికి మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హీరో చిరంజీవి కి తమ్ముడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న వెంకట్ పలు ఆసక్తికర పెంచారు. తనకు చదువు పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో మోడల్ నుంచి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపారు. ఇండస్ట్రీ కి కొత్తగా వచ్చిన కొత్తలో ఒక డాన్స్ మాస్టర్ అందరి ముందు తనను అవమానించారని తెలిపారు.

అంతేకాకుండా తాను దేనికీ పనికి రానని అన్నారని, గురించి పట్టుకొచ్చారని విసుగు ప్రదర్శించాడు అని తెలిపాడు వెంకట్. అంతేకాకుండా ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన చెంప చెల్లుమనిపించాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ అయిదుగురు సినిమా షూటింగ్ సమయంలో తనకు పెద్ద ప్రమాదం జరిగిందని దానితో మూడు నెలల పాటు బెడ్ కే పరిమితమైనట్లు తెలిపారు.