విక్రమ్ సినిమా కోసం సూర్య రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంత తీసుకున్నారో తెలుసా?

లోకనాయకుడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నాలుగు సంవత్సరాల తర్వాత విక్రమ్ సినిమా ద్వారా వెండితెర ప్రేక్షకులను సందడి చేశారు.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో కమల్ హాసన్ తన సొంత నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గత మూడు సంవత్సరాల నుంచి కమల్ హాసన్ సినిమాలలో నటించలేదనే వెలితిని ఈ సినిమా భర్తీ చేసిందని చెప్పాలి. ఈ విధంగా కమల్ హాసన్ విక్రమ్ సినిమా మొదటి షో తోనే అద్భుతమైన హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు మరొక కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఈ విధంగా స్టార్ హీరోలందరూ ఈ సినిమాలో నటించడంతో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని చెప్పాలి.

ఇక ఈ ముగ్గురు హీరోలు మాత్రమే కాకుండా ఈ సినిమాలో అతిథి పాత్ర ద్వారా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సందడి చేశారు. ఇక సూర్య పవర్ ఫుల్ ఎంట్రీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇకపోతే ఈ సినిమాలో సూర్య అతిథి పాత్రలో నటించడం కోసం ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ సినిమా కోసం సూర్య ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ లేకుండా ఉచితంగా సినిమాలో నటించినట్లు సమాచారం.సూర్య తన జీవితంలో ఒక్కసారైనా కమలహాసన్ తో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక ఉండేదట.ఇలా విక్రమ్ సినిమా ద్వారా తన కల నెరవేరడంతో సంతోషం వ్యక్తం చేసిన సూర్య ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది.