నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎవరూ ఊహించని విధంగా అన్ని భాషలలోను వరుస హిట్ సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. తెలుగు తమిళ చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా షూటింగ్లతో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక తనకు ఏమాత్రం విరామం దొరికిన వెంటనే తన కుటుంబంతో కలిసి ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు. ఇప్పటికే తన చిట్టి చెల్లెలితో కలిసి రష్మిక చేసే రచ్చ ఎలా ఉంటుందో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈమె వరుస సినిమా షూటింగులతో హైదరాబాద్ ముంబై వంటి ప్రాంతాలలో ఉండటం వల్ల తన కుటుంబాన్ని ఎంతో మిస్ అవుతున్నాను అని ఎన్నో సందర్భాలలో వెల్లడించారు.
ఇకపోతే తాజాగా తన తల్లిదండ్రుల గురించి రష్మిక సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.నేడు తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం అయినప్పటికీ రష్మిక చాలా ఆలస్యంగా తన తల్లిదండ్రులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.తను చాలా ఆలస్యంగా శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు క్షమాపణలు చెబుతూనే నన్ను పుట్టించి ఈ ప్రపంచానికి పరిచయం చేసినందుకు థాంక్స్.. నన్ను నాకు నచ్చినట్టుగా బ్రతకనిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీరే కారణం మీకు ఈ జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ రష్మిక చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.