ఓ చిన్నదాన, ఆనంద్, వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో రాజా గురించి అందరికీ సుపరిచితమే. ఈయన పలు సినిమాలలో నటించినా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం ఈ హీరో పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు. ఈ విధంగా ఈ హీరోకి అవకాశాలు లేక వెండితెరకు దూరం అవ్వడమే కాకుండా ఈయన మతం మార్చుకుని క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఈ క్రమంలోనే క్రైస్తవ మత ప్రచార కర్తగా ఈయన ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా రాజా తన వ్యక్తిగత జీవితాన్ని తనకు ఇష్టమైన విధంగా గడుపుతున్నారు ఇందులో ఎలాంటి తప్పు లేదని చెప్పాలి.
అయితే తన వ్యక్తిగత జీవితంలో భాగంగా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తూ సినిమాలపై ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ విధంగా సినిమాల గురించి రాజా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ… శుక్రవారం వచ్చిందంటే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే చాలా మంది సినిమా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ సంబరపడిపోతూ ఉంటారు. గంటసేపు లైన్లో నిలబడి టిక్కెట్లు కొనుకొని మూడు గంటల పాటు ఆ సినిమా చూస్తూ మీ సమయం వృధా చేసుకుంటున్నారు. ఆ పనికి మాలిన సినిమాలు చూడటం వల్ల మీకు ఎలాంటి లాభం లేదు.
ఆ సినిమాలు చూసే సమయంలో మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థించండి. ఇలాంటి చెడుతనం మన చుట్టుపక్కల ఉండగా మనం ఏమాత్రం చలనం లేకుండా బ్రతుకుతున్నాము అంటే దుష్టుడితో మనం స్నేహం చేస్తున్నట్టే అంటూ పరోక్షంగా హీరో రాజా సినిమాల పై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందించి.. అబ్బబ్బ ఎంత బాగా నటిస్తున్నారు.. ఈ నటన ఏందో సినిమాలలో నటించి ఉంటే మంచి స్థానంలో ఉండేవారు అంటూ కామెంట్ చేయగా .. దాదాపు 30 సినిమాల వరకు నటించి ఇప్పుడు సినిమాల పై ఇలాంటి విమర్శలు చేయడం ఏంటి అంటూ మరికొందరు తీవ్రస్థాయిలో ఇతని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు