Serial Artist: ఆయన ఎక్కడి నుంచి వస్తారో ఈ కుర్రనాయళ్లు..ఏమీ తెలియదు అని తిట్టారు… సీరియల్ ఆర్టిస్ట్ అవినాష్!

Serial Artist: తనను ఒక బ్యాడ్ ఆర్టిస్ట్‌గా, తనను తాను పాలిష్ చేసుకోవాలి అని అనిపించేటట్టుగా ఇప్పటివరకు జరిగిన తన కెరీర్‌లో ఒక సంఘటన జరిగిందని సీరియల్ నటుడు అవినాష్ ఇటీవలి కాలంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నర్రా వెంకటేశ్వర రావు అనే సీనియర్ ఆర్టిస్ట్ ఉండేవారని, ఆయన సినిమాల్లో కూడా నటించారని, అయితే తాను చేస్తున్న మొదటి ప్రాజెక్టులో ఆయన కూడా చేశారని అవినాష్ చెప్పారు. కాగా ఆయన సీరియల్ కోసమని హాఫ్‌ డే మాత్రమే చేసేంటుకు ఒప్పుకొని వచ్చారని, మళ్లీ సినిమా షూటింగ్ ఏదో ఉందని చెప్పారని ఆయన అన్నారు.

అయితే తాను ఇండస్ట్రీకి కొత్త. కాబట్టి ప్రతీ సీనూ టేకుల మీద టేకులు తీసుకుంటున్నాను. ఆయన అది చూసి చాలా విసుగెత్తిపోయారు. కానీ అవేవీ తాను పట్టించుకోలేదని, ఎందుకంటే తాను అప్పుడే కొత్త కదా, వాళ్లు ఫీలవుతారని అవేం తనకు తెలియవని, చిన్న పిల్లోడిలాగా నవ్వుతూ అక్కడ సరదాగా ఉన్నానని అవినాష్ చెప్పారు. ఆయనకు కోపం వచ్చి డైరెక్టర్‌ గారితో చాలా తలనొప్పి వస్తుంది. ఒక 5నిమిషాలు ఆగి చేద్దామని ఆన్నట్టు ఆయన తెలిపారు. సరే అని చెప్పి తాను తన గదిలోకి వెళ్లి కూర్చున్నానని, తన గదికి ఎదురుగానే ఆయన గది కూడా ఉందని అవినాష్ అన్నారు.

ఇకపోతే గొంతు మామూలుగానే కొంచెం గట్టిగా ఉంటుందని, అయితే ఆయన్నే డైరెక్టర్‌ను పిలిపించుకొని తిట్టడం మొదలుపెట్టారని అవినాష్ చెప్పారు. ఏమన్నారంటే ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారు ఇలాంటి కుర్రనాయల్ని, వీళ్లకు బిహేవియర్ తెలియదు. ఫ్రొఫెషనలిజం తెలియదు. వాడికి ఒక డైలాగ్ చెప్పడం రావడం లేదు, మూమెంట్ చేయడం రావడం లేదు. ఒక ఎక్స్‌ప్రెషన్ రావడం లేదు. మా టైం ఎందుకు దొబ్బుతారు. నాకు సినిమా ఉంది ఇంకా చేయాల్సింది. నాకనవసరం ఈ సీన్లు అవుతాయో లేవో, నేను ఒంటిగంటకు లంచ్ టైం వరకు వెళ్లిపోవాలి. ఆ టైం వరకు చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు అన్నారని అవినాష్ తెలిపారు.

అయితే అవన్నీ విన్న తాను చాలా డిసప్పాయింట్ అయ్యానని, ఆ మాటలు తనను చాలా బాధపెట్టాయని ఆయన చెప్పారు. ఇంట్లో కూడా తనను ఎవరూ ఏమీ అనరని, ఓకేసారి ఒక మనిషి తనను అలా అనేసరికి తీసుకోలేకపోయానని ఆయన అన్నారు. చాలా మనస్తాపం చెంది, కార్లో కూర్చొని ఏడ్చానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇంటికి వెళ్లిపోయి చాలా కుంగిపోయి, ఎలాగైనా ఆయనకంటే బెస్ట్ యాక్టర్ అని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నట్టు ఆయన వివరించారు.

ఇక అప్పటినుంచి తనను తాను మెరుగుపరుచుకుంటూ వచ్చి ఆ ఏడాదే బెస్ట్ యాక్టర్‌గా అవార్డు కూడా అందుకున్నానని, అప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి మీవల్లే ఇదంతా అని కూడా చెప్పానని, ఆ మూమెంట్ తనకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుందని అవినాష్ వివరించారు.