OG: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీబిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ ఓజి సినిమాలో శిరీష లేళ్ల అవకాశం దక్కించుకుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాకపోవడంతో చాలామంది కొట్టి పారేశారు.
కాగా ఇదే విషయంపై తాజాగా శిరీష కు కాబోయే భర్త టాలీవుడ్ నటుడు నారా రోహిత్ స్పందించారు. ఆయన తాజాగా నటించిన చిత్రం భైరవం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నారా రోహిత్ మాట్లాడుతూ అసలు విషయాన్నీ బయట పెట్టారు. ప్రతినిధి2 సినిమాలో నారా రోహిత్ సరసన శిరీషా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన వారిద్దరూ గత ఏడాదిలో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఈ జంటకి వివాహం కూడా కానుంది. ఆ సంగతి పక్కన పెడితే.. భైరవం సినిమా మే 30వ తేదీన విడుదల కానున్న సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. ఓజీ సినిమాలో నాకు కాబోయే సతీమణి శీరీషా కూడా నటించారు. ఒక కీలకమైన పాత్రలో నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది అని ఆయన అన్నారు. ప్రస్తుతం రోహిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే సోషల్ మీడియాలో వినిపించిన వార్తలు నిజమే అన్నమాట. మరి శిరీష ఎలాంటి పాత్రలో నటించింది ఆమె క్యారెక్టర్ ఏంటి అన్నది తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి. కాగా ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ స్పీడ్ గానే సాగుతోంది. ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఒక లీడ్ రోల్ లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.