Naga Babu: గర్ల్ ఫ్రెండ్ గురించి ప్రశ్నించిన నెటిజన్… దిమ్మతిరిగే సమాధానం చెప్పిన నాగబాబు?

Naga Babu: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలకు నిర్మాతగా అలాగే నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాబ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన వెండితెరకు దూరం అయినప్పటికీ బుల్లితెరపై న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న నాగబాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అలాగే జనసేన పార్టీ బాధ్యతలను చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు.

ఇలా నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాగబాబు తరచూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, మంచు కుటుంబం పై పరోక్షంగా విమర్శలు చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అలాగే సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగే ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు వివిధ రకాల ప్రశ్నలడుగుతూ సమాధానాలు రాబట్టారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ నాగబాబును ప్రశ్నిస్తూ మీకు గతంలో అయినా, ఇప్పుడైనా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగబాబు సమాధానం చెబుతూ..హా ఉన్నారు.. నా భార్య అంటూ ఆ నెటిజెన్ కు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ నటించిన గనీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా రిజల్ట్ గురించి మరొక నెటిజెన్ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాగబాబు సమాధానం చెబుతూ సిని జర్నీ అన్న తర్వాత ఈ విధమైనటువంటి హిట్స్ ఫ్లాప్స్ సర్వసాధారణం అని తెలియజేశారు.