Chalapathi Rao: ఎన్టీఆర్‌కి, నాగేశ్వర్ రావు గారికి మధ్య విభేదాలు రావడానికి కారణం కొంత మంది చేసిన ప్రొడ్యూసర్లు చేసిన పనులేనని నటుడు చలపతిరావు చెప్పారు. వాళ్లు చేసిన దానికి నాగేశ్వర్ రావు గారు హైదరాబాద్‌కు వెళ్లిపోయారని, ఆలా వెళ్లిపోవడానికి వారే కారణమని ఆయన స్పష్టం చేశారు. లేకపోతే వెళ్లేవాడు కాదని ఆయన చెప్పారు.
రామారావుకు అప్పటికే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని, అందుకని ఇక్కడ ఉండడం కన్నా హైదరాబాద్‌కు వెళితే సుఖం అని చెప్పి కొందరు ప్రొడ్యూసర్లు ప్రోత్సహించారని ఆయన చెప్పారు. అందరూ అలా ఏవో కారణాలు చెప్తారు గానీ, పోటీ తత్వమే లేకపోతే వాళ్లిద్దరూ కలిసి 12 సినిమాలు చేయరని చలపతిరావు అన్నారు. ఇండస్ట్రీలో ఇప్పటివరకు కలిసి 12 సినిమాలు చేసింది వాళ్లిద్దరేనని ఆయన చెప్పారు.
వాళ్లతో కలిసి కృష్ణ, శోభన్ బాబు కూడా వారి సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించేవారని ఆయన అన్నారు. ఈ రోజుల్లో ఏ హీరోలైనా రెండు సినిమాల కంటే ఎక్కువ చేశారా అని ఆయన ప్రశ్నించారు. వారిద్దరి మధ్య అంత స్నేహం, కలిసి మెలిసి ఉండేవారు కాబట్టే అన్ని సినిమాలు తీయగలిగారని ఆయన చెప్పారు. వారే కాదు, వారి కుటుంబాలు కూడా కలిసిపోయేవాళ్లని ఆయన తెలిపారు. కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య పోటీతత్వం పెరిగిపోయి, ప్రొడ్యూసర్లు చెప్పారని నాగేశ్వర్ రావు హైదరాబాద్‌కు వెళ్లిపోయారని చలపతిరావు చెప్పారు. ఆ తర్వాత వాళ్లు కూడా మళ్లీ ఎన్టీఆర్‌తో కలిసి సినిమాలు తీశారని ఆయన అన్నారు. ఆ రోజుల్లో అందరూ కలిసి నటించేవారని, కానీ వాళ్లు చిన్న వేషం వేశారని గానీ, వీళ్లు పెద్ద వేషం వేశారని గానీ ఎక్కడా తేడాలుండేవి కావని ఆయన స్పష్టం చేశారు.