చిరంజీవి బయోపిక్ గురించి క్లారిటీ ఇచ్చిన బెనర్జీ..

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు బెనర్జీ తాజాగా చిరంజీవి బయోపిక్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఆయన తాజాగా ‘చెప్పాలని ఉంది’ అనే కార్యక్రమంలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకున్నాడు. తాను చిరంజీవి బయోపిక్ తీస్తానని వస్తున్న ప్రచారాలు అన్ని వట్టి దేనని క్లారిటీ ఇచ్చాడు.

యూట్యూబ్లో తమకు నచ్చినట్లుగా రాస్తూ ఉంటారని అన్నాడు. ఇక చిరంజీవి కష్టాలు, బాధలు, అవమానాలు , ఆయన ఘనతలు సినిమాగా తీస్తే బాగుంటుందని అన్నారు. ఇక ఆయన చేసే సేవా కార్యక్రమాలు కొన్ని మాత్రమే బయటికి తెలుస్తున్నాయి అని.. చాలా సేవలు ఇంకా ఎవరికీ తెలియదు అని అన్నారు. ఇక తనను ఎవరైనా దూషించిన ఆయన పట్టించుకోడని, నటుడిగా ఆయన నుండి ఎంతో నేర్చుకోవాలి అని అన్నారు.