Acharya : ఓటిటిలో “ఆచార్య”! అందుకు భారీ మొత్తంలో చెల్లించారట.!

Acharya Coming Early In OTT

Acharya Coming Early In OTT : ఈ ఏడాదిలో లోనే కాకుండా టాలీవుడ్ హిస్టరీ లోనే ఒక భారీ ప్లాప్ గా నిలిచిపోయిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు నటించిన బిగ్ మల్టీ స్టారర్ సినిమా “ఆచార్య” కూడా ఒకటి. దర్శకుడు కొరటాల శివ కెరీర్ లో ఫస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది.

అయితే అనుకోని రీతిలో భారీ నష్టాలు చవి చూసిన ఈ సినిమా అన్ని డిజాస్టర్ సినిమాల ట్రెండ్ లోనే ఎర్లీ స్ట్రీమింగ్ కి వచ్చేందుకు సిద్ధంగా ఉందట. అయితే ఈ చిత్రం తాలూకా ఓటిటి హక్కులను ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చెయ్యగా వీరు ఈ సినిమాని అప్పుడే ఆడియెన్స్ కోసం తెచ్చేయడానికి సిద్ధం చేస్తున్నారట.

మరి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ తో ఈ మే 15నే సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేస్తోందట. అయితే ఈ తక్కువ రోజుల స్ట్రీమింగ్ కి గాను ఆల్రెడీ కుదుర్చుకున్న డీల్ కన్నా 18 కోట్లు అధికంగా ఇచ్చి తీసుకొస్తున్నారట. మరి ఈ లాభంతో డిస్ట్రిబ్యూటర్స్ కి ఏమన్నా సాయం చేస్తారో చూడాలి.

ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కాజల్ రోల్ ని పూర్తిగా పక్కన పెట్టేసారు. అలాగే మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.