Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్ముతారు.ఈ క్రమంలోని మన ఇంటి నిర్మాణం చేపట్టిన సమయం నుంచి ఇంటిలో అలంకరించుకునే ప్రతి ఒక్క వస్తువు వరకు ప్రతిదీ వాస్తు శాస్త్రం ప్రకారం సరైన స్థలంలో ఉండాలని భావిస్తాము. ఈ విధంగా వాస్తు శాస్త్రాన్ని సరైన రీతిలో పాటించడం వల్ల ఏవిధమైనటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పవచ్చు. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు పొరపాటున కూడా మంచంపై పెట్టకూడదు అని చెబుతారు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
దేవుడికి ఉపయోగించే పూజా సామాగ్రి అనగా కొబ్బరికాయ, పువ్వులు ,పసుపు, కుంకుమ, అలాగే సాలగ్రామాలు వంటి వాటిని పొరపాటున కూడా పెట్టకూడదు. అదేవిధంగా రుద్రాక్షలు, బంగారు, వెండి ఆభరణాలు వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను కూడా మంచంపై పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల పరమ దరిద్రం కలుగుతుంది. చాలామంది పడకగదిలో బీరువా తెరవగానే అందులో ఉన్నటువంటి వస్తువులు కింద పడి పోతాయేమోనని భావించి వెంటనే తీసి మంచంపై పెడతారు. ఇలా పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చాలా మందికి ఉన్న అలవాటు ఏమిటంటే వెంటనే బీరువా నుంచి తీసిన బంగారు నగలను మంచంపై పెట్టుకొని వాటిని అలంకరించుకోవడం చేస్తుంటారు.ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఈ క్రమంలోనే మన ఇంటికి ఎలాంటి బంగారం రాకుండా చేయడమే కాకుండా ఉన్న బంగారం కూడా పలు కారణాల వల్ల బ్యాంకు లేదా లాకర్ లో పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అందుకోసమే బంగారం ఎప్పుడూ కూడా మంచంపై పెట్టకూడదు.