AbhiShek Bachchan: ఒంటరిగా ఉండాలని ఉంది.. సంచలన పోస్ట్ చేసిన అభిషేక్ బచ్చన్.. అసలేం జరిగిందంటే!

Ahbishek Bachchan: బాలీవుడ్ నటుడు హీరో అభిషేక్ బచ్చన్ గురించి మనందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్ వారసుడిగా అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాయ్ భర్తగా మనందరికీ సుపరిచితమే. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి హీరోగా మంచు గుర్తింపు తెచ్చుకున్నారు అభిషేక్ బచ్చన్. ఆయన నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇకపోతే అభిషేక్ బచ్చన్ నటించిన లేటెస్ట్ మూవీ హౌస్ ఫుల్ 5. ఈ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

దీంతో మూవీ మేకర్స్ కి ఊహించని షాక్ ఎదురైనట్టు అయింది. ఇలాంటి సమయంలోనే అభిషేక్ బచ్చన్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పోస్టులో ఏమి ఉంది అన్న విషయానికి వస్తే.. నేను మరోసారి ఒంటిరిగా ఉండాలని ఉంది. నా కోసం నేను కొంత సమయం కేటాయించుకోవాలని అనిపిస్తుంది. ఈ జనసమూహం నుంచి దూరంగా ఉంటూ నన్ను నేను వెతుక్కోవాలనుకుంటున్నాను. నా ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నాకూ కొంత సమయం కావాలి.

నా గురించి నేను తెలుసుకునేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది అంటూ హిందీలో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలేం జరిగింది ఎందుకు అభిషేక్ బచ్చన్ ఇలాంటి పోస్ట్ చేశారు. ఈ పోస్టుతో గత కొంతకాలంగా అభిషేక్, ఐశ్వర్య రాయ్ ల విడాకులు అంటూ వచ్చిన వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. మ్యారేజ్ లైఫ్ బాగోలేదా, లేదంటే ఏదైనా గొడవలు జరిగాయా, ఈ వయసులో ఒంటరిగా ఉండాలి అనుకోవడం ఏంటి అంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పోస్ట్ పై అభిషేక్ బచ్చన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..