రష్మి యాంకరింగ్ గురించి అది షాకింగ్ కామెంట్స్…?

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో రష్మి గౌతమ్ కూడా ఒకరు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించిన రష్మీ సినిమాల ద్వారా ఆమె కి అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకుంది. బెంగాలీ అమ్మాయి అయినా రష్మీ మొదట తెలుగు రాక ఎన్నో ఇబ్బందులు పడేది. కానీ తను చేసే పని మీద ఉన్న గౌరవంతో ఎంతో కష్టపడి తెలుగు నేర్చుకొని ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతోంది. ఇక రష్మీ తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సుధీర్ తో క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ వల్ల రేష్మి బాగా పాపులర్ అయింది.

ప్రస్తుతం రష్మీ ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా సింగిల్ గా యాంకరింగ్ చేస్తోంది. ఈ షో మొదలుపెట్టిన ప్రారంభంలో సుధీర్ ఈ షో కి యాంకర్ గా వ్యవహరించేవాడు అయితే సుధీర్ మా టీవీ లో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో కి వెళ్ళటంతో రష్మీ సుధీర్ స్థానంలో యాంకర్ గా కొనసాగుతోంది. అయితే ఈ షో లో ఆది, రామ్ ప్రసాద్ తన పంచ్ లతో రష్మి ని ఒక ఆట ఆడుకుంటారు. అంతేకాకుండా బాబు బాబు అంటూ సుధీర్ గురించి ప్రస్తావిస్తూ రష్మి మీద సెటైర్లు వేస్తూ ఉంటారు.అయితే ఇలా మీరు రశ్మి మీద ఎన్ని కౌంటర్లు వేసైనా, ఎన్ని సెటైర్లు వేసిన రష్మి మాత్రం చిరునవ్వుతో వాటిని స్వీకరిస్తూ ఉంటుంది.

ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో కూడా రష్మి మీద ఆది తన పంచ్ లతో విరుచుకుపడ్డాడు. ఎప్పుడు రష్మి తెలుగు గురించి సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇక ఈ ఎపిసోడ్ లో ఇంద్రజ కూడా రష్మీ తెలుగు గురించి సెటైర్ వేసింది. ఇక ఈ ఎపిసోడ్లో ఆది ఏకంగా రష్మీకి యాంకరింగ్ రాదు అంటూ కామెంట్ చేశాడు. ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో బోనాల సందర్భంగా సింగర్ మధుప్రియ తన కుటుంబంతో కలిసి ఈ షోలో సందడి చేసింది. మీ ఊర్లో ఏం స్పెషల్ అంటూ ఆది అడిగితే .. ఆమె లేనివి ఉన్నట్టు చెబుతుంది. ఈ క్రమంలో ఆది యాంకర్ ఉన్నా యాంకరింగ్ రాదు.. కమెడియన్స్ ఉన్నా కామెడీ చేయరు అంటూ పంచ్ వేస్తాడు. ఇలా రష్మికి యాంకరింగ్ రాదు అంటూ ఆది కామెంట్ చేసినా కూడా రష్మీ మాత్రం సైలెంట్ గానే ఉంది.