ఆది.. ఏంటిదీ ఏకంగా హీరోయిన్ పై చేయి వేస్తూ ముచ్చట్లు పెట్టిన ఆది?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడంతో ఈయనకు మల్లెమాల వారికి మధ్య ఏదో గొడవలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.అయితే జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పిన ఆది మల్లెమాలవారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఢీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ ప్రోమోలో భాగంగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ 1980 వ ఎపిసోడ్ కావడంతో ఈ ఎపిసోడ్ ను స్పెషల్ ఎపిసోడ్ గా ప్రసారం చేయనున్నారు. ఇక స్పెషల్ ఎపిసోడ్ అంటే తప్పనిసరిగా గెస్టులు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేస్తారు. ఇక ఈ కార్యక్రమంలో అక్కినేని హీరో సుశాంత్ హీరోయిన్ ప్రియ ఆనంద్ హాజరయ్యి ప్రేక్షకులను సందడి చేయనున్నారు. సుశాంత్ ప్రియ ఆనంద్ కలిసి నటిస్తున్న మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది హీరోయిన్ ప్రియ ఆనంద్ తో కలిసి ఒక కామెడీ స్కిట్ చేశారు. హైపర్ ఆది డైరెక్టర్ గాను, ప్రియా ఆనంద్ హీరోయిన్ గాను స్కిట్ చేశారు. ఇక ఈ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది ఏకంగా హీరోయిన్ భుజంపై చేతులు వేస్తూ మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక హైపర్ ఆది తన మాటలతో ఆమెను నవ్వించారు. ఇక ప్రియా ఆనంద్ సైతం హైపర్ ఆదికి హగ్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.