ఆ డైలాగ్ తో పుష్పం అయ్యావు అంటూ వర్ష, ఇమ్మానియేల్ ను అవమానించిన ఆది!

ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ప్రస్తుతం ఆ కార్యక్రమానికి దూరమయ్యారు.అయితే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈటీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది వర్ష ఇమ్మానియేల్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది పుష్ప స్పూఫ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో అన్నపూర్ణమ్మ శ్రీవల్లిగా నటించడంతో హైపర్ ఆది తనపై వరుస సెటైర్లు వేస్తూ అందరిని నవ్వించారు.

అలాగే ఈ స్కిట్ లో ఇమ్మానియేల్ పుష్ప పాత్రలో సందడి చేశారు. ఇమ్మానియేల్ ఎంట్రీ ఇవ్వగా హైపర్ ఆది మాట్లాడుతూ.. ఎవడ్రా నువ్వు షెకావత్‌కు జుట్టు వచ్చిందా? పుష్పకు జుట్టు పోయిందా? అని ఆది అడగడంతో ఇమ్మానియేల్ మొన్నటి డైలాగుతో పుష్ప అయ్యాను అని చెప్పగా బ్యాక్ గ్రౌండ్లో గత ఎపిసోడ్లో వర్ష మీ అమ్మకు చెప్పు కోడలు వచ్చింది అంటూ అని చెప్పిన డైలాగ్ వేస్తారు.ఇలా ఆ డైలాగ్ వేయడంతో నువ్వు పుష్ప కాదు పుష్పం అయ్యావు అంటూ హైపర్ ఆది ఈ జోడి పరువు తీసాడు. మొత్తానికి హైపర్ ఆది తన కామెడీ పంచ్ డైలాగులతో అందరినీ సందడి చేస్తున్నారు.

ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న హైపర్ ఆది కేవలం మల్లెమాల వారితో రెమ్యూనరేషన్ విషయంలో భేదాభిప్రాయాలు రావడం వల్ల తప్పుకున్నారని మరికొద్ది రోజులలో శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ కార్యక్రమాల నుంచి కూడా తప్పుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియదు. అయితే ఇప్పటికే ఈటీవీ కార్యక్రమాల నుంచి సుడిగాలి సుదీర్ పూర్తిగా తప్పుకున్నారు.