ప్రగతి ఆంటీతో కలిసి మాస్ స్టెప్పులు వేయించిన ఆది.. వీడియో వైరల్…!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రగతి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది. సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ మీద చీర కట్టులో ఎంతో సాంప్రదాయంగా కనిపించే ప్రగతి బయట మాత్రం ట్రెండీ దుస్తుల్లో ఉంటుంది. ఇక ప్రగతి ఆంటీ సోషల్ మీడియాలో ఎక్కువగా జిమ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఫిట్నెస్ మీద ఎక్కువ ఆసక్తి చూపే ప్రగతి తరచూ జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ ఆ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ వీడియోస్ షేర్ చేసిన కొన్ని నిమిషాలకే వైరల్ అవుతుంటాయి. తాజాగా ప్రగతి బుల్లితెర మీద సందడి చేసింది. ఆషాడ మాసం సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ఆషాడం అల్లుళ్లు అని కొత్త ఈవెంట్ ని మొదలు పెట్టింది. ఈ ఈవెంట్ కి ప్రగతి గెస్ట్ గా హాజరయ్యింది. సుధీర్, ఇంద్రజ గారు ఈ షో నుండి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం ఆది పెత్తనం సాగుతోంది. ఆది, రాంప్రసాద్ మాత్రమే ఈ షో ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పటంలో సందేహం లేదు. తాజాగా ప్రగతి ఈ షోలో పాల్గొనడంతో ఆది ప్రగతి మీద తన పంచ్ ల వర్షం కురిపించాడు. అంతే కాకుండా ప్రగతి జిమ్ వీడియోస్ కూడా ప్లే చేసి కామెడీ చేశాడు.

అయితే ఈ షో లో ప్రగతి తనలో ఉన్న మాస్ ప్రగతిని ప్రేక్షకులకి పరిచయం చేసింది. ఆదితో కలిసి మాస్ స్టెప్పులు వేస్తూ ఇరగదీసింది. చీర కట్టులో కూడా ప్రగతి ఇలా మాస్ స్టెప్పులు వేయటంతో అక్కడున్న వారు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఈ షో లో అందరూ కూడా మాస్ స్టెప్పులతో ఈ ఎపిసోడ్ లో బాగా సందడి చేశారు.ఇక ఈ వీడియోలో ఆది అత్తలని కొట్టటానికి బదులు రష్మిని చితక బాదేశాడు.ఇక రష్మి, సుధీర్ గురించి మాట్లాడుతూ.. మా అందరికీ ఒక నెల ఆషాడం అయితే నీకు ఒక సంవత్సరం అషాడం ఉంటుంది అని ఆది అంటాడు. ఈవారం ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలై వైరల్ గా మారింది.

Sridevi Drama Company #AashadamAllullu Promo - Every Sunday @1:00 PM - 10th July 2022 -Rashmi,Poorna