జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆది సుధీర్?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది సుడిగాలి సుదీర్ ముందు వరుసలో ఉంటారు. ఇలా ఈ కార్యక్రమం వీరికి ఎంతో మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పాలి. జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ప్రస్తుతం సినిమా అవకాశాలను కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.అయితే వీరికి విపరీతమైన క్రేజ్ వచ్చిన తర్వాత ఇతర అవకాశాలు రావడంతో వీరు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు గురించి మీరు ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు.

జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనే సమయంలో వీరికి పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ అందేది.ఈ కార్యక్రమంలో వారానికి ఒకసారి లక్షల లో పేమెంట్ తీసుకునే ఆది సుధీర్ ప్రస్తుతం సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల సరైన సమయానికి పేమెంట్ రాకపోవడంతో కాస్త ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. సినిమా పూర్తి అయితే తప్ప పేమెంట్ ఇవ్వరు అలాగే కొందరు దర్శక నిర్మాతలు కొన్నిసార్లు పేమెంట్ ఇవ్వని సందర్భాలు కూడా ఉంటాయి. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సుధీర్ ఆది సరికొత్త ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

జబర్దస్త్ కార్యక్రమం ఒక కామెడీ షోగా ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.యూ ట్యూబ్ లో సుడిగాలి సుదీర్ అలాగే హైపర్ ఆది కొత్త కామెడీ షో మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరుకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.