Warrior Movie: హీరో రామ్ పోతినేని సినిమాలో విలన్ ఆది రోల్ రివీల్..?

Warrior Movie: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది వారియర్. ఈ సినిమాకు తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కృతి శెట్టి,అక్షర గౌడ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మరొకసారి తన విలనిజాన్ని చూపించబోతున్నాడు ఆది పినిశెట్టి.

 

సరైనోడు సినిమా తర్వాత రెండో సినిమా ఇదే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఆది పినిశెట్టి లుక్ ని మహాశివరాత్రి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఇందులో గురు పాత్రలో ఆది పినిశెట్టి నటించబోతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో గురు పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది అని దర్శకుడు లింగుస్వామి తెలిపారు. అంతేకాకుండా ఆది పినిశెట్టి విలన్ గా అందరిని మెప్పిస్తాడు, ఆశ్చర్యపరిచాడు అని దర్శకుడు లింగుస్వామి తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.