ఆచార్య టీజ‌ర్‌కు టైం ఫిక్స్ చేసిన కొర‌టాల‌.. ఇక సంద‌డికి సిద్ధం కండి!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆచార్య‌. కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌. క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. 2021లో ఈ చిత్రం విడుద‌ల కావ‌డం ప‌క్కా. ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ సెట్స్ లోకి అడుగుపెట్ట‌గా, ఆయ‌న ప్రీలుక్ విడుద‌ల చేసి మూవీపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచారు. అయితే అప్పుడెప్పుడో పోస్ట‌ర్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌క‌పోయే స‌రికి ఫ్యాన్స్ నిరూత్స‌హంలో ఉన్నారు. దీనిని అర్దం చేసుకున్న చిరంజీవి టీజ‌ర్ రిలీజ్ డేట్ చెప్ప‌క‌పోతే నేనే లీక్ చేస్తానంటూ కొర‌టాల‌కు వార్నింగ్ ఇచ్చాడు.

Aachar2 | Telugu Rajyam

ఆగస్ట్ 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య మోషన్ పోస్టర్ విడుదలైంది. దానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. న్యూ ఇయర్ కానుకగా ఆచార్య టీజర్ వస్తుందని అనుకున్నారు.. కానీ రాలేదు. సంక్రాంతికి అనుకున్నారు అది జ‌ర‌గ‌లేదు, క‌నీసం రిప‌బ్లిక్ డేకు అయిన వ‌స్తుందేమో అని మెగా ఫ్యాన్స్ ఆశ‌గా చూశారు. అది జ‌ర‌గ‌లేదు. దీంతో ఓ మీమ్‌తో చిరు కొర‌టాల‌కు చుర‌క అంటించారు. దీంతో టీజ‌ర్ రిలీజ్ డేట్ ఎప్పుడ‌నేది కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు.

జ‌న‌వ‌రి 29న ఆచార్య టీజ‌ర్ విడుద‌ల కానుందంట మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా తెలియ‌జేశారు. దీంతో అంద‌రి దృష్టి 29న ప‌డింది. ఆ రోజు సాయంత్రం 4గంట‌ల 5 నిమిషాల‌కు ఆచార్య టీజ‌ర్ ర‌చ్చ చేయ‌నుంది. సామాజిక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు పసందైన వినోదం అందిస్తుంద‌ని అంటున్నారు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ నక్స్‌లైట్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక అని తెలుస్తుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles