సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల్ని వేధించే సంఘటనలు తరచూ చూస్తూనే ఉంటాము. కానీ ఈ మధ్యకాలంలో అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ఉన్న మహిళలు ఈ విషయాలలో కూడా వారికి ఏమాత్రం తీసి పోవడం లేదు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని తమ మాయ మాటలతో లొంగ తీసుకోవటమే కాకుండా వారిని బెదిరించి లక్షల రూపాయలు డబ్బు రాబడుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళితే… తాడేపల్లిలో ఉన్న విశ్వవిద్యాలయంలో బీబీఏ విద్యను అభ్యసిస్తున్న ఒక యువకుడికి కొంతకాలం క్రితం ఫోన్ లో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ మహిళ తరచూ యువకుడికి ఫోన్ చేస్తూ నెమ్మదిగా అతనితో పరిచయం పెంచుకుంది. ఆ మహిళ మోజులో పడిన యువకుడు ఆమెకు పూర్తిగా లొంగిపోయాడు. ఈ క్రమంలో ఒకరోజు నగ్న వీడియోలు తీసి పంపమని మహిళ కోరగా యువకుడు తన నగ్న వీడియోలను మహిళకు పంపించాడు.
ఆ వీడియోలు ఆమెకు చేరిన తర్వాత నిజస్వరూపం బయటపెట్టింది. నగ్న వీడియోలు పేరుతో యువకుడిని బెదిరిస్తూ తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్న వీడియోలను బయట పెడతానని యువకుడిని బెదిరించింది. పాపం పరువు పోతుందని భావించిన యువకుడు ఆమెకు రూ 8 వేలు పంపించాడు. అయినా కూడా సదరు మహిళ మరింత డబ్బు కావాలని యువకుడిని బెదిరించడంతో ఈ యువకుడు సుమారు లక్ష రూపాయలకు పైగా డబ్బును అందించారు అయినా డబ్బు కావాలని బెదిరించడంతో యువకుడు పోలీసులను ఆశ్రయించి మహిళ మీద ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.