Crime News: అసభ్యకర వీడియోలతో యువతి పై ఒత్తిడి చేస్తున్న యువకుడు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..!

Crime News: ఈ మధ్యకాలంలో యువతీ యువకులు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడే చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఈ రోజుల్లో యువత స్నేహం పేరుతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల నోయిడాలో స్నేహితుడని నమ్మినందుకు యువకుడు అసభ్యకర వీడియోలు పంపించి యువతిని శారీరకంగా కలవాలని ఒత్తిడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే… ఒక యువతికి నోయిడాలో ఎంబీఏ గ్రాడ్యుయేషన్ చేస్తున్న గ్రాడ్యుయేషన్ చేస్తున్న యువకుడితో 2 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. కొంతకాలం వీరిద్దరు ఎంతో స్నేహంగా ఉన్న తర్వాత యువకుడి ప్రవర్తనలో మార్పు రావడంతో యువతి అతడిని దూరంగా పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల యువకుడు మళ్లీ తనతో స్నేహం చేయాలని కోరగా అతనిని నమ్మి యువతి ఒక అవకాశం ఇస్తూ తన వాట్సాప్ నెంబర్ పంపించింది.

యువకుడు ఇదే అదనుగా చేసుకుని మళ్ళీ తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూ ఈ నెల 21వ తేదీ వాట్సప్ ద్వారా ఒక అసభ్యకర వీడియో చేస్తూ తనతో శారీరకంగా కలవాలని యువతిని ఒత్తిడి చేశాడు. ఆ వీడియో చూసిన యువతి తీవ్ర ఆగ్రహానికి గురై యువకుడి మీద ఈనెల 27వ తేదీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఉదయం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354, 509ల కింద కేసు నమోదు చేసి నోయిడా సెక్టార్ 61లో అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచి అతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.