Radhe Shyam : ఇన్సైడ్ టాక్ : లేటెస్ట్ గా “రాధే శ్యామ్” కి టెంప్టింగ్ ఓటిటి డీల్..ఎన్ని కోట్లో?

Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ గా తన సినీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకంగా దేశంలోనే నెంబర్ 1 హీరోగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన హీరో ప్రభాస్. తన అన్ని సినిమాలు కూడా ఇప్పుడు ఒకదాన్ని మించి ఒకటి వేరే లెవెల్లో ఉంటున్నాయి. అత్యధిక బడ్జెట్ తో ఎన్ని వందలు కోట్లు అయినా ప్రభాస్ పై పెట్టేందుకు నిర్మాతలు లైన్ లో నిలబడుతున్నారు.

మరి అంత క్రేజ్ ఉంది కాబట్టే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” కి కళ్ళు చెదిరే టెంప్టింగ్ డీల్ వచ్చిందట. తాను నటించిన కంప్లీట్ క్లాస్ సినిమా ఇది. దర్శకుడు రాధా కృష్ణ భారీ విజువల్స్ తో తెరకెక్కించాడు. మరి ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ లేట్ చేస్తుండడంతో ఓటిటి రిలీజ్ అంటూ కొన్ని షాకింగ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

కానీ మేకర్స్ థియేటర్స్ లోనే మొదట రిలీజ్ అని ఫిక్స్ చేశారు. మరి ఇదిలా ఉండగా అసలు లేటెస్ట్ గా రాధే శ్యామ్ కి ఎంత మొత్తంలో అఫర్ వచ్చిందో షాకింగ్ ఫిగర్ తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి గాను 400 నుంచి 500 కోట్లు ఆఫర్ వచ్చిందట. ఇది నిజంగా ఒక టెంప్టింగ్ ఆఫర్ అని చెప్పి తీరాలి. అయినా కూడా చిత్ర నిర్మాతలు ఈ ఆఫర్ ను వద్దనుకున్నారట. దీనితో ఈ విషయమే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది.