దూకుడు సినిమా ను మిస్ చేసుకున్న స్టార్ యాక్టర్

మహేష్ బాబు సినిమా కెరీర్ లో ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘దూకుడు’ ఎప్పటికి స్పెషల్ మూవీస్ గా నిలిచిపోతాయి. ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక మహేష్ బాబు ‘సైనికుడు’, ‘అతిధి’, ‘ఖలేజా’ లాంటి భారీ డిజాస్టర్స్ చూసాడు. ‘ఖలేజా’ సినిమా ప్లాప్ అయ్యాక మహేష్ బాబు చాలా రోజులు డిప్రెషన్ లోనుండి బయటక రాలేకపోయాడు. ఇంక మహేష్ బాబు కెరీర్ అయిపోయింది అనుకునే టైం లో వచ్చింది ‘దూకుడు’ సినిమా.

అప్పటికే ‘ఢీ’, ‘రెడీ’, ‘కింగ్’ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న శ్రీను వైట్ల మొదటి సారి మహేష్ బాబు తో ఈ సినిమా చేసాడు. శ్రీను వైట్ల వచ్చి ఈ కథ చెప్పగానే ఎంతగానో నచ్చి వెంటనే డేట్స్ ఇచ్చేశాడట మహేష్.

‘దూకుడు’ సినిమా తండ్రి సెంటిమెంట్ ని ఆధారంగా తీసుకొని నిర్మించారు. బ్రహ్మానందం మరియు MS నారాయణ పండించిన అద్భుతమైన కామెడీ వల్లే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యినప్పటికీ..తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం..దాని నుండి పుట్టిన సెంటిమెంట్ మరియు ఎమోషన్స్ ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లేలా చేసింది.

ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్ ఎంతో అద్భుతంగా నటించారు. కానీ మొదట ఈ రోల్ ‘రియల్ స్టార్’ శ్రీ హరి కి వెళ్లిందంటే. అప్పటికే ‘ఢీ’, ‘కింగ్’ సినిమాల్లో నటించిన శ్రీ హరి కి శ్రీను వైట్ల కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ మహేష్ బాబు తండ్రి పాత్ర కి తాను సరిపోనని..దానిని మహేష్ కి అన్నయ్య పాత్ర గా మారిస్తే కచ్చితంగా చేస్తాను అని చెప్పాడట..కానీ కథ మార్చడానికి కుదర్లేదు. ఆలా శ్రీ హరి మిస్ చేసుకున్న రోల్ ప్రకాష్ రాజ్ కి వచ్చింది.

అప్పట్లోనే 56 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో తెలుగు సినిమా సత్తా చాటింది..అక్కడ ఈ సినిమా దాదాపుగా 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.