షాకింగ్ : ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ నుంచి కళ్ళు చెదిరే రేంజ్ ప్రకటన.!

ఇండియా సినిమా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకడైన ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ప్రపంచ స్థాయి భారీ చిత్రం “ప్రాజెక్ట్ కే” కోసం కూడా అందరికీ తెలిసిందే. దీనిని దర్శకుడు మహానటి ఫేమ్ నాగశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. మరి మినిమమ్ 500 కోట్ల కాస్ట్లీ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ అలాగే దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో ఆల్రెడీ దర్శకుడు చెప్పాడు. దీనిని ఒక స్కై ఫై థ్రిల్లర్ కం ఫాంటసీ థ్రిల్లర్ గా ప్లాన్ చేశారు.

మరి ఈ భారీ చిత్రం నుంచి అసలు ప్రభాస్ రోల్ ని ఎలా చూడబోతున్నామో అనే దానిపై ఓ ఊహించని అనౌన్సమెంట్ ని అయితే ఈ చిత్రం నుంచి వచ్చింది. మరి ఈ పోస్టర్ లో చూసినట్టు అయితే ప్రభాస్ తో ఒక రోబాటిక్ సూట్ లాంటిది వేసినట్టుగా చూపిస్తున్నారు.

అలాగే బ్యాక్గ్రౌండ్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ లోనిదిలా ఇది కనిపిస్తుంది. దీనితో అయితే ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి ఈ అప్డేట్ మాత్రం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చెయ్యలేదని చెప్పొచ్చు. మరి ఈ భారీ చిత్రంని పేరుకి తగ్గట్టుగా వరల్డ్ ప్రాజెక్ట్ లానే నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసినట్టు అర్ధం అవుతుంది.