Prabhas Salaar : ప్రభాస్ “సలార్” లో ఆ ఒక్క సీన్ కోసం భారీ స్థాయి ఖర్చు.?

Prabhas Salaar : పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ భారీ సినిమాల్లో కేజీఎఫ్ ఫేమ్ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ ఏక్షన్ డ్రామా “సలార్” కూడా ఒకటి. ప్రభాస్ కెరీర్ లో మళ్ళీ వస్తున్న ఒక పక్కా మాస్ సినిమా కావడంతో దీనిపై ఎనలేని క్రేజ్ నెలకొంది.

అందుకు తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా గత రెండు రోజులు నుంచి ఈ సినిమాలో ఓ భారీ సీన్ కోసం ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికర టాక్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఏక్షన్ సీక్వెన్స్ లలో ఒకటైన సీన్ కి గాను ఏకంగా 25 కోట్లు ఖర్చు పెడుతున్నారట.

ఇది బిగ్ స్క్రీన్స్ పై బ్లాస్టింగ్ లా ఉంటుందని కూడా తెలుస్తుంది. అలాగే ఈ సీన్ పై మరో ఆసక్తికర టాక్ కూడా వినిపిస్తుంది. దాని ప్రకారం అయితే ఈ సినిమాలో ఈ సీన్ ప్రీ క్లైమాక్స్ లో ఉంటుందట. అంటే ఇక అసలు సిసలు క్లైమాక్స్ సీన్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

మొత్తానికి అయితే ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో ఈ టాక్ నే ఆసక్తిగా వినిపిస్తుంది. ఇక ఈ భారీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే కేజీఎఫ్ సంగీత దర్శక, నిర్మాతలే ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు.