Vijaya Devarakonda: ఆ ప్రాజెక్టు కోసం ఎవరూ ఊహించని విధంగా పారితోషికం తీసుకుంటున్న రౌడీ హీరో!

Vijaya Devarakonda: ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే హీరోగా గుర్తింపు పొందడం కోసం ఎంతో కష్టపడిన హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో విశేషమైన ప్రేక్షకాదరణ పొంది మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ చార్మి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమాలో చేయడం కోసం విజయ్ దేవరకొండ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కోసం సుమారు 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడమే కాకుండా ఈ సినిమా లాభాలలో పర్సెంట్ కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన తదుపరి ప్రాజెక్ట్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే పాన్ ఇండియా చిత్రానికి విజయ్ దేవరకొండ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే సమాచారం వినబడుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి రాంపేజ్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా కథనాలు వినబడుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం రౌడీ హీరో ఏకంగా 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఫిలిం ఇండస్ట్రీ టాక్. మరి వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ద్వారా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచిచూడాలి.