Accident:ప్రతిరోజు నిత్యం ఎన్నో ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాలు జరిగే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలలో ఎంతోమంది ప్రతిరోజు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలకు తీరని బాధ మిగులుస్తున్నారు.ఇటీవల జనగాం జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తండ్రి ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే… నేల కోసం రోడ్డు పక్కన బండి నిలపటం వల్ల ప్రమాదం జరిగింది. తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోగా తల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కిల్లో సోనాపతి అనే వ్యక్తి విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురంలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. ఈయన కుటుంబంతో కలిసి ఎస్.కోటలో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావటం వల్ల భార్యాపిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లారు. శివ లింగాపురం వైపు వెళ్తూ మార్గమధ్యలో తాటిముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ద్విచక్ర వాహనాన్ని ఆపారు.
అదే సమయంలోకాకినాడకు చెందిన ఒక కుటుంబం మరియు నుండి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి వేగంగా వచ్చి సోనాపతి కుటుంబ సభ్యులతో పాటు మరొక ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టింది. దీంతో వారి ఇద్దరు పిల్లలు ఎగిరిపోయి రోడ్డు మీద పడగా వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోనాపతి, అతని భార్యను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సోనాపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అతని భార్య ప్రాణాలతో పోరాడుతుంది.
ఈ ఘటనలో మరొక ద్విచక్ర వాహనంలో ఉన్న పెదఖండేపల్లికి చెందిన కొసరు అప్పారావు,సుహిత(5) అనే చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. చిన్నారి కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.