Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్,రష్మిక మందనలు కలిసిన నటించిన తాజా చిత్రం పుష్ప 2. ఇటీవల భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల గ్రాస్ ను దాటి మరిన్ని కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.. ఇప్పటికీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. కేవలం 11 రోజుల్లో 1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు బ్రేక్ చేసింది పుష్ప 2. ఇకపోతే ఈ సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే..
ఒక్కో సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో చూసేకి అనే సాంగ్, కిస్సిక్ సాంగులు యూట్యూబ్ లో సంచలన రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఇక ఈ సాంగ్స్ కి సోషల్ మీడియాలో తమ తమ డ్యాన్సులతో దుమ్ము లేపుతున్నారు నెటిజన్స్. యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ లో వందల కొద్ది రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా ఒక కొత్త జంట కూడా పెళ్లి బట్టలలో సూసేకి పాటకి అదిరిపోయే స్టెప్పులు వేశారు.
అచ్చం ఆ పాటలో రష్మిక, బన్నీ వేసినట్టే స్టెప్పులు వేసి డాన్స్ ను ఇరగదీశారు నవ వధువు వరుడు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ పాట వైరల్ కావడంతో ఈ కొత్త జంట కాస్తా ట్రెండింగ్ లోకి వచ్చేసారు. ఆ వీడియోని చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఇది కదా పుష్పరాజ్ అంటే, మన అల్లు అర్జున్ తో మామూలుగా ఉండదు, ఆ పాటలకు ఎవరైనా స్టెప్పులు వేసి తీరాల్సిందే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ నవవధువు వరుడు చేసిన డాన్స్ సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డాన్స్ నీ చుట్టూ ఉన్న పెళ్లికి వచ్చిన అతిథులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
