Poonam Bajwa: సోషల్ మీడియా వేదికగా నటి పూనమ్ ను నాటు ప్రశ్న అడిగిన నెటిజన్.. నటి రియాక్షన్ ఇదే?

Poonam Bajwa: కాశ్మీర్ ఆపిల్ మాదిరి ఎంతో అందంగా ముద్దుగా బొద్దుగా ఉండే టాలీవుడ్ ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈమె తెలుగులో పలు చిత్రాల్లో నటించి అందరిని మెప్పించినప్పటికీ ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక తెలుగులో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన ఫోటోలను తన కుటుంబ విషయాల గురించి వెల్లడిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించింది. ఇలా నెటిజెన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. ఉన్న ఈ హీరోయిన్ కు ఒక డిజైన్ నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ఇలా ఒక నెటిజన్ నుంచి ఎదురైన నాటు ప్రశ్నకు ఈమె ఏమాత్రం ఆవేశపడకుండా ఎంతో కూల్ గా సమాధానం చెప్పింది. ఇంతకీ ఆ నెటిజన్ అడిగిన ప్రశ్న ఏమిటి అనే విషయానికి వస్తే…

మీ సెక్సీ స్ట్రక్చర్ వెనుకున్న ఆ సీక్రెట్ ఏంటి అనే ప్రశ్న అడగడంతో అందుకు పూనమ్ బజ్వా తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె సమాధానం చెబుతూ ప్రతి రోజు నేను యోగ చేయడమే నా సీక్రెట్ అంటూ యోగా చేస్తున్నటువంటి ఫోటోని షేర్ చేసింది. ఇలా పూనమ్ బజ్వా తనదైన స్టైల్లో సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ఆ నెటిజన్ నోట వెంట మాట రాలేదని చెప్పాలి.