Baladitya: తేజ గారి విషయంలో పొరపాటు జరిగింది.. నా ఫోన్ ఎత్తకపోవడంతో చాలా కంగారు పడ్డా: బాలాదిత్య

Baladitya: డైరెక్టర్‌ తేజ గారి సినిమా దాదాపు ఓకే అయిందనుకున్న సమయంలోనే క్యాన్సిల్ అయిందన్న విషయంపై నటుడు బాలాదిత్య పెదవి విప్పారు. తాను ఈ మూవీ విషయంపైనే కలిసినపుడు ఒక 15 రోజుల పాటు ఆయనతో ఒక ట్రావెల్ నడిచిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకు చాలా ఓపిక అని, తాను రాసిన పాటలు, కవితలు, ఐడియాలు అన్నీ ఆయన చాలా సహనంతో వినేవారని ఆయన అన్నారు. తేజ గారు కూడా తన ఒపీనియన్స్, ఐడియాలను వెల్లడించేవారని ఆయన చెప్పారు. దాంతో తామిద్దరి మధ్య మంచి రాపో ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.

అలా అన్ని రోజులు కలిసినా, మాట్లాడినా తనను మాత్రం మీరు అనే సంBaladitya, tollywood, hero, teja, director, film industryభోదించేవారంటూ బాలాదిత్య చెప్పారు. అదే విషయం తనను అడిగితే మీకు కాకపోయినా, మీలో ఉన్న ఆర్టిస్ట్‌కు ఆ గౌరదం ఇస్తున్నాను అనుకోండి అని అనేవారని ఆయన అన్నారు. అంతే తప్ప ఆయన పొరపాటున కూడా తనను అమర్యాదగా చూడలేదని బాలాదిత్య తెలిపారు. అయితే తేజ గారు తనకు ఓ సారి ఓ మాట చెప్పారని, అదేంటంటే నీ నెంబర్ అవతలి వాళ్ల దగ్గర ఉన్నా కూడా నీకు కాల్ రాలేదంటే వదిలేసేయ్. ఎందుకంటే వారికి మీ అవసరం లేదేమో. ఎవరి నెంబర్ అయితే లేదో వాళ్ల నెంబర్‌ని తీసుకొని ప్రయత్నించు అని తనకు చెప్పినట్టు బాలాదిత్య చెప్పారు. అది తనకు బాగా నచ్చిందని, ఆ దిశగానే తాను ప్రయత్నాలు కొనసాగించానని ఆయన వివరించారు.

మీరు చాలా కష్టపడుతున్నారు.. ఐనా కూడా అవకాశం రావట్లేదు.. కాబట్టి తానొక పని చెప్తా చేయమన్నారని బాలాదిత్య అన్నారు. మీరు తేజ సినిమాలో నటిస్తున్నట్లు అందరికీ చెప్పమని చెప్పారని ఆయన అన్నారు. ఏమైనా ప్రాబ్లెమ్ ఐతే ఆపుడు చూద్దాం అని అన్నారని ఆయన తెలిపారు. తేజ సినిమా చేస్తున్నా అంటే.. అలా ఐనా ఇంకా కొంతమందికి మీరు తెలిసి… మీకు అవకాశాలు కూడా వస్తే మంచిదే కదా అని తేజ అన్నట్టు బాలాదిత్య వివరించారు.

ఆ తర్వాత తాము అనుకున్నట్టుగానే… బాలాదిత్య ప్రెస్ కి అందరికీ ప్రకటించేశానని చెప్పారు. దాంతో.. అక్కడున్న వారు … తనను పొగిడారని చెప్పారు. ఇదంతా అయిపోయిన మరుసటి రోజు.. న్యూస్ పేపర్ చూడగానే… తేజ సినిమాలో బాలాదిత్య హీరో అని రావడంతో షాక్ అయ్యానని ఆయన తెలిపారు. తన ఫోన్ చూస్కుంటే 10 మిస్డ్ కాల్స్… చాలా మెసేజ్ లు ఉన్నాయని ఆయన అన్నారు. అవన్నీ కూడా తనకు తేజ సినిమాలో ఛాన్స్ వచ్చిందని … కంగ్రాట్స్ చెప్తూ వచ్చిన మెసేజెస్, కాల్స్…. వెంటనే తేజ గారికి ఫోన్ చేస్తే.. ఆయన ఆరోజు రెస్పాండ్ కాకపోయే సరికి అసలేమైందోనని టెన్షన్ పడ్డట్టు ఆయన తెలిపారు.

వెంటనే భరణి గారికి కాల్ చేయడంతో… ఆయన తేజగారికి ఫోన్ చేసి మాట్లాడారు. నాతో కూడా తేజ గారు కాల్ చేసి జరిగిన దానికి నువ్వేం టెన్షన్ పడకు.. ఐనా అలా చేయమని నేనే చెప్పాను కదా.. ఆ పేపర్ వాళ్ళు ఫోన్ చేసి సారీ చెప్పారని తేజ చెప్పడంతో బాలాదిత్య కొంచెం రిలాక్స్ అయినట్లు తెలిపారు.