ప్రభాస్ “సలార్” నుంచి మాస్ ట్రీట్ కన్ఫర్మ్ అట.!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గరే కాదు పాన్ ఆసియన్ సినిమా లెవెల్ మార్కెట్ ఉన్న హీరో ప్రభాస్. ఇది సందీప్ రెడ్డి వంగ సినిమాతో కంప్లీట్ అయ్యిపోతుంది కానీ దీనికి ముందు ప్రభాస్ ఇంకొన్ని సినిమాలు కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. అయితే వీటిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా “సలార్” కూడా ఒకటి. మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వేరే లెవెల్ మాస్ డ్రామాగా తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా నుంచి ప్రభాస్ బర్త్ డే కానుకగా ఓ అదిరే గిఫ్ట్ రానుంది అని ఇది వరకు టాక్ ఉంది. అయితే తాజా బజ్ ప్రకారం వచ్చే ఆక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే కానుకగా సలార్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీస్ చెయ్యడం కన్ఫర్మ్ అయ్యిందట. ఆల్రెడీ దీని కట్ టేకింగ్ స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ లో ప్రభాస్ చేసిన ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ గ్లింప్స్ వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కేజీఎఫ్ నిర్మాతలే దీనిని కూడా నిర్మాణం వహిస్తున్నారు.