ప్రభాస్ “సలార్” నుంచి మాస్ గిఫ్ట్ వస్తుందా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేమ్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు తాను హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ సినిమా “సలార్”. కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా అనేక అంచనాలు ఉన్నాయి. మరి ఈ భారీ సినిమా నుంచి రాబోతున్న ప్రభాస్ బర్త్ డే కాకుండా వేరే లెవెల్ మాస్ గిఫ్ట్ వస్తున్నట్టుగా తెలుస్తుంది.

వచ్చే అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ భారీ అప్డేట్ కమ్ గిఫ్ట్ ని మేకర్స్ అందించనున్నట్టు తెలుస్తుంది. ఇదే రోజున మరిన్ని అప్డేట్స్ అన్ని సినిమాలు నుంచి కూడా రాబోతున్నాయి. ఇక ఈ సినిమాకి కేజీయఫ్ కి అదిరే సంగీతం అందించిన రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా ఆ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే వారే అత్యధిక వ్యయంతో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.