Nellore: ప్రస్తుతం ఆత్మహత్య చేసుకునే వారు తన ఆత్మహత్యకు ఒక సెల్ఫీ వీడియో ద్వారా కారణాలు చెప్పి మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగూడెంలో నివాసముంటున్న రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి వనమ రాఘవేంద్ర కారణమని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసాడు. వీడియో అప్పట్లో సంచలనంగా మారింది.వీడియో ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేసి వనమా రాఘవేంద్రను అరెస్టు చేశారు. అతనిని కఠినంగా శిక్షించాలని ప్రజలు ధర్నాలు చేశారు.
మొన్నటికి మొన్న నెల్లూరులో భర్తతో గొడవపడి మనస్తాపంతో భార్య ఉరి వేసుకుంటే భర్త కొంచం కూడా కనికరం లేకుండా వీడియో తీసి తన బంధువులకు షేర్ చేశాడు. భార్య ఆత్మహత్యాయత్నం చేస్తుంటే ఆపకుండా వీడియో తీసిన కసాయి భర్త గురించి బంధువులు ఆగ్రహానికి గురై పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇటీవల భార్య ఉరి వేసుకుంటుంది అని తెలిసి కూడా ఆపకుండా చోద్యం చూసిన పెంచలయ్య అను ఆ కసాయి భర్త సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియోలో పెంచలయ్య తన భార్య ఆత్మహత్యకు గల కారణాల గురించి వెల్లడించాడు. తన భార్య ఆత్మహత్యకు 6మంది కారణమని సేల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు. తనకు తన భార్యకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఆరు మందిని కఠినంగా శిక్షించాలని పెంచలయ్య డిమాండ్ చేశారు.