Crime News: ఈ మధ్యకాలంలో చాలామంది మగవారు వావివరుసలు మరచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు వృద్ధులు అని కూడా చూడకుండా వారి కామవాంఛలు తీర్చుకోవడానికి అత్యాచారాలు చేస్తున్నారు. ఇటువంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రతిరోజు ఇటువంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇటువంటి దయనీయమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది.
శివమొగ్గ జిల్లాలోని కుంసి పరిధిలో బాధాకర సంఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మైనర్ బాలిక చదువు నిమిత్తం తన అక్క బావ ఇంట్లో ఉంటూ చదువుకోడానికి వెళ్ళేది. తన కూతురి వయస్సున్న మరదలిని తండ్రి స్థానంలో ఉంటూ కూతురిల్లా చూడాల్సిన భావ ఆ మైనర్ బాలికను దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. తన భార్య లేని సమయంలో లో ఆ చిన్నారికి లేనిపోని మాటలు చెప్పి ఆ మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నం చేసి తన కోరికలు తీర్చుకునే వాడు. కొంతకాలం తర్వాత ఆ బాలికకు ఒంట్లో నలతగా ఉండటం తో తన అక్క దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్ళింది.
అక్కడ ఆ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె ఏడు నెలల గర్భవతిగా నిర్ధారించారు. హాస్పిటల్లో గొడవ జరగకుండా ముందు జాగ్రత్తగా ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండినట్టుగా చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఏడు నెలల గర్భం తో ఉన్న ఈ సమయంలో ఆ బాలికకు కాన్పు కాగా బిడ్డ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుసిం పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.