Kadapa: సమాజంలో రోజు రోజుకి అత్యాచారాలు, హత్యలు, అలాగే ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సమాజంలో మానవత్వం అన్నది ఈ మంట కలిసి పోయింది. ఆస్తి కోసం తల్లిదండ్రులను కొడుకులు, అన్నదమ్ములు ఇలా మానవత్వాన్ని మరిచి ఆస్తుల కోసం చంపుకుంటున్నారు. ఇంకా కొందరు అయితే నడిరోడ్డుపై దారుణంగా హత్యలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఆస్తి తగాదాల కారణంగా ఎంతోమంది మరణించిన విషయం తెలిసిందే.
ఇప్పటికీ రోజూ ఏదో ఒక ప్రదేశంలో ఈ ఆస్థి తగాదాల కారణంగా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆస్తి తగాదాలలో పడి డబ్బుల కోసం ఆస్తుల కోసం కన్న బంధాలను, బంధుత్వాలను మరిచి మరి చంపుతున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కడపజిల్లాలో ఇలాంటి దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఏకంగా అన్నా వదిన లను చంపేశాడు ఒక కిరాతకుడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్టణంలోని దస్తగిరి పేట లో నీలాకరం,మోషె, సరోజమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు.అయితే మోషే కి అతని సోదరుడు యేసయ్యకు మధ్య కొద్ది రోజుల నుంచి ఆస్తి తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా యేసయ్య పట్టపగలే తన సోదరుడు వదిన లను రాడ్డుతో ఇంట్లోకి దూరి కొట్టి మరి చంపేశాడు. రాడ్డు తో బలంగా కొట్టడంతో మోషే దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల హత్యకు కారణం ఆస్తి తగాదాలే ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.