Crime News: ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు ఉక్రెయిన్ లో జరుగుతున్న భారీ యుద్దం గురించి మాట్లాడుకున్నారు. యుద్దం ఇలాగే కొనసాగితే మూడవ ప్రపంచ యుద్దం సంభవించే ప్రమాదం కూడా ఉంది. రష్యా డాడీకి ఉక్రెయిన్ అతలాకుతలం ఐపోతుంది. అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఈ తరుణంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థుల కోసం భారత్ ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసింది.
ఇదే అదునుగా చేసుకొని ఒక అజ్ఞాత వ్యక్తి ఉక్రెయిన్ లో చిక్కుకున్న తన కూతురిని కాపాడతానని చెప్పి మహిళలను మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన వైశాలి విల్సన్ అనే ఓ మహిళ..ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదువుతున్న తన కూతురు గురించి ఆందోళన చెంది , తన కూతురిని సురక్షితంగా ఇంటికి చేర్చాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికారులను, జాతీయ స్థాయి నేతలను కలిసి వేడుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి వైశాలి కి ఫోన్ చేసి ప్రధాని కార్యాలయం నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి కూతురుని ఇండియా కి తీసుకురావాలంటే ఫ్లైట్ టికెట్ కింద రూ.42,000 డిపాజిట్ చేయాలంటూ” నమ్మబలికాడు.
కూతురి కోసం ఆందోళన చెందుతున్న ఆమె ఏమి ఆలోచించకుండా రూ 42000 డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బులు తీసుకున్న తర్వాత అవతలి వ్యక్తి నుండి ఎటువంటి సమాచారం లేకపోగా.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావటంతో వైశాలి కి అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించి విదిశా పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో విదిశా ఎస్పీ మోనికా శుక్లా మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని గుర్తించామని నిందితుడు ఎక్కడున్నా అతి తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా అధికారులు వైశాలి కూతురిని ఇండియా కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు