తెలుగు ఇండస్ట్రీ ని ముప్పయ్యేళ్లు స్టార్ హీరో గా ఏలిన చిరంజీవి రాజకీయాలకోసం దాదాపు దశాబ్దకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. చిరంజీవి లేకపోయినా తన కొడుకు రామ్ చరణ్ ఉన్నాడు కనుక ఫాన్స్ అంత గా మిస్ అవ్వలేదు. పది సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150 ‘ సినిమా తో రీ-ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సైరా’, ‘ఆచార్య’ సినిమాలు మాత్రం నిరాశపరిచాయి. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ సినిమా తో త్వరలో మన ముందుకు రానున్నాడు చిరంజీవి. ఈ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయింది.
అయితే చిరంజీవిని కొత్త పాత్రల్లో చూడాలి అతని ఫాన్స్ ఎప్పుడూ కోరుకుంటారు. కొత్త కొత్త కథలని చిరంజీవి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలి అని అనుకుంటారు. చిరంజీవిని కొత్త పాత్రల్లో చూడాలి అని జనం ఎప్పుడూ ఆరాటపడుతుంటారు. కొత్త కొత్త కథలని చిరంజీవి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలి అని అనుకుంటారు. ఈ క్రమంలో ఓ అభిమాని ట్విట్టర్ లో ఇలా ఓపెన్ లెటర్ పోస్ట్ చేసారు.
చిరంజీవి గారు
ఒక సినిమాలో ఆ తార కాకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించినప్పుడు అది అసలి నటన. కన్యాశుల్కంలో NTR కనిపించడు. గిరీశం మాత్రమే కనిపిస్తాడు. చంటబ్బాయి లో చిరంజీవి కనిపించడు. పాండురంగా రావు మాత్రమే ఉంటాడు. నాకు ఆ చిరంజీవి కావాలి.
ఆ రుద్రవీణ సూర్యం కావాలి. ఆ గాంగ్ లీడర్ రాజారాం కావాలి. ఈ ఖైదీ 150, సైరా, లూసిఫెర్ ఒద్దు! తెలుగు వాళ్ళకి సినిమా పిచ్చి సార్! లూసిఫెర్ మేము ఎప్పుడో చూసేసాం. అయినా మోహన్ లాల్ మనోడే. పృద్ధ్విరాజ్ మనోడే! మళ్ళీ అదే కథ మీతో చూసి ఏం చేయమంటారు?
అయినా రీ మేకులే తప్ప మన దగ్గర కథలు లేవా? కథనాలు లేవా? మీరు ఏదో మాటవరసకి “అర్థాకలి” అంటూ ఉంటారు గాని, మీకు ఆకలే లేదు. ఆ సూర్యం పాత్రలో “నేను సైతం” అంటూ బయటకొచ్చే నటుడు నాకు కనిపించట్లేదు. ఖైది 150 కి మీరెందుకు సార్? మీ రేంజ్ ఏంటి మీరు చేసే కథలేంటి? ఇంకెన్ని రోజులండి ఈ కథలు రాయడం రాని కథకులతో. వీళ్ళు సీన్లు తీయడంలో సినిమాని మర్చి పోయారు. మీరు పస్తు ఉండండి కొన్ని రోజులు. చిరంజీవి కనిపించకుండా నటించండి. అది చూడాలనుంది. తప్పుగా భావించకండి! మీకు అద్దం చూపించాలి మరి!