సమంత ప్రవర్తనలో మార్పు.. తలలు పట్టుకుంటున్న నిర్మాతలు?

తెలుగు, తమిళ్ , హిందీ, కన్నడ భాషలో వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగచైతన్య హీరోగా నటించిన “ఏమాయ చేసావే” సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత.. ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో సమంత మొదటి స్థానంలో ఉంది అని చెప్పడంలో సందేహం లేదు.

ఇదిలా ఉండగా నాగచైతన్యను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో నాగ చైతన్య నుండి విడిపోయింది. అయితే నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందాలు ఆరబోస్తూ.. బోల్డ్ ఫోటో షూట్ లతో సందడి చేస్తున్న సమంత ని నెటిజెన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ అమ్మడు అప్పుడప్పుడు నెటిజెన్స్ మీద తెగ ఫైర్ అవుతోంది.

నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది . అయితే ఈ మధ్య కాలంలో సమంత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నాగచైతన్యతో కలిసి ఉన్న సమయంలో ఎంతో పద్ధతిగా ఉండే సమంత ప్రస్తుతం బోల్డ్ ఫోటోలతో దర్శనమిస్తోంది.దీంతో కొందరు నెటిజన్స్ సమంత మీద విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే ఇప్పుడు సమంత పై ఉన్న ఈ వ్యతిరేకత ఆమె నటించిన సినిమాలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం తెలుగులో సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించారు. దీంతో సోషల్ మీడియాలో సమంత వ్యవహరించే తీరు తో నిర్మాతలు కొంత వరకు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.