Radhe Shyam : బిగ్ అప్డేట్ : “రాధే శ్యామ్” ఓటిటి రిలీజ్ పై ఫైనల్ క్లారిటీ వచ్చేసింది.!

Radhe Shyam : నిన్న మొన్నటి నుంచి సినీ వర్గాల్లో ఒక ఊహించని గాసిప్ వైరల్ అవుతూ వస్తుంది. మన ఇండియన్ సినిమా దగ్గర ఒక భారీ బడ్జెట్ చిత్రం ఇప్పుడు పరిస్థితులు రీత్యా డైరెక్ట్ గా ఓటిటి లోనే రిలీజ్ అవ్వబోతుంది అని అనేక సినిమాల పేర్లు ఈ ఓటిటి రిలీజ్ పై వినిపించ సాగాయి.

అయితే ఈ భారీ సినిమాల లిస్ట్ లో ఎందుకో గాని ఎక్కువగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” పేరే ఎక్కువగా వినిపించింది. ఇక దానితో ఆల్ మోస్ట్ ఈ సినిమానే ఓటిటి లో రిలీజ్ అవుతుంది అని ఊహాగానాలు గట్టిగానే స్ప్రెడ్ కాగా దీనిపై ఒక అధికారిక క్లారిటీ లాగ ఒక ప్రకటన అయితే నమ్మశక్యంగా ఉందని చెప్పాలి.

చిత్ర బృందం నుంచి అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ సినీ వర్గాలు ప్రముఖులు అయితే ఈ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి ఈ లిస్ట్ లో ఈ సినిమాకి గ్రాండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కూడా ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు.

ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తామని మీతో నేను కూడా కలిసి చూస్తానని ఒక పక్కా క్లారిటీ ఇచ్చాడు. దీనితో ఈ సినిమాకి వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి నుంచి ఈ కీలక అప్డేట్ రావడంతో ప్రభాస్ అభిమానులు కాస్త కుదుట పడ్డారు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.