Prabhas Project K : ప్రభాస్ వరల్డ్ “ప్రాజెక్ట్ కె” లో వీరికి అవకాశం..ఈ టాలెంట్ మీలో కూడా ఉందా?

Prabhas Project K

Prabhas Project K :  ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని సిద్ధం అవుతున్న సినిమాల్లో టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో విజన్ తో తెరకెక్కించిన వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కె”. చాలా వినూత్న కాన్సెప్ట్ తో దాదాపు 500 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిజంగా ఒక గొప్ప విషయం ఏమిటంటే…

ఈ చిత్ర బృందం దాదాపు లోకల్ టాలెంట్ నే ప్రోత్సహించడం అని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా సినిమాకి కావాల్సిన నటీనటులు మరియు ఇతర టెక్నికల్ టీం ని కూడా సోషల్ మీడియా ద్వారా ఆహ్వానించి ఆడిషన్స్ ద్వారా తీసుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఈ సినిమా నుంచి కొంతమందికి భారీ ఆఫర్ ని అందించారు.

దీని ప్రకారం చూస్తే ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వారి కోసం చిత్ర యూనిట్ చూస్తున్నారట. సరికొత్త యాక్షన్ కొరియోగ్రాఫర్స్ మరియు మార్షల్ ఆర్టిస్ట్స్ సహా క్యాలరీ తెలిసిన వారు అలాగే ఇతర మార్షల్స్ లో ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని తమ మెయిల్ ని ఇచ్చారు.

దీనితో వీరికి కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. మరి మీలో కూడా ఈ టాలెంట్ ఉంటే ఈ భారీ సినిమాలో ఆఫర్ మీదే కావచ్చు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.