Prabhas And Anushka : ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ సినిమాలో అనుష్క?సిసలైన క్లారిటీ మీకోసం.!

Prabhas And Anushka : మన తెలుగు చలన చిత్రం దగ్గర బిగ్ స్క్రీన్ పై కొన్ని జంటలకు ఒక స్పెషల్ మార్క్ ఉందని చెప్పాలి. సినిమా ఎలా ఉన్నా కూడా ఆ హీరో మరియు హీరోయిన్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఆ మ్యాజిక్ వేరే లెవెల్లో ఉంటుంది.
అలాంటి ఒక అదిరే జంట పైగా టాలీవుడ్ లో చాలా మందికి ఇష్టమైన జంట ప్రభాస్ మరియు అనుష్క లది. ఇద్దరు కూడా హీరో, హీరోయిన్ విభాగాల్లో లెజెండ్స్.
అయితే ఈ ఇద్దరి కాంబోలో లాస్ట్ టైం సెన్సేషనల్ హిట్ అయినటువంటి “బాహుబలి” సిరీస్ అంతకు ముందు “మిర్చి” వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అని సినీ వర్గాల్లో ఒక టాక్ బయటకి వచ్చి పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమా దర్శకుడు మారుతితో ప్లాన్ చేసింది అని దానికి అనుష్క ఫైనల్ అయ్యిందని టాక్ వచ్చింది. అయితే అసలు నిజంగానే ఈమె ఉందా లేదా అనే దానిపై కొన్ని ట్రస్టెడ్ సినీ వర్గాలు నుంచి సిసలైన సమాచారం ప్రకారం అసలు ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదట.
మళ్ళీ ప్రభాస్ మరియు అనుష్క లు సినిమాలు చేయడం లేదని అవన్నీ కేవలం గాసిప్స్ మాత్రమే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాకి హీరోయిన్స్ పేర్లు ఫైనల్ అయ్యాయని వారితోనే సినిమా ఉండబోతుంది అని ఇప్పుడు తెలుస్తుంది.
సో ప్రభాస్ మరియు అనుష్క అభిమానులకి ఇది కాస్త చేదు వార్తే అని చెప్పాలి. అయితే ఈ సినిమా త్వరలోనే అనౌన్స్ కానుంది.