డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కటి ఇంటర్నెట్‌తోనే ముడిపడింది. మనం ఏదైన సమస్యల గురించి సమాచారం తెలుసుకోవాలన్నా , నాలెడ్జ్ పెంచుకోవాలన్నా , టిక్కెట్స్ బుకింగ్స్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా అన్ని ఇంటర్నెట్ తో అనుసంధానం అయి ఉన్నాయి. ఇంటర్నెట్ యూజర్స్ రోజురోజుకు పెరుగుతూ పోతుండడం వలన బ్రౌజింగ్ సమస్యలు చాలా వస్తున్నాయి. నెట్ స్లో అవుతుండడం, మధ్యలోనే డిస్‌కనెక్ట్ కావడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే స్లో ఇంటర్‌నెట్ తాజాగా ఓ బాలిక కొంపముంచింది.
ప్రస్తుత జీవన విధానికి తగ్గట్టు చాలా మంది ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వెరైటీ వంటలు తినాలనిపించినప్పుడు లేదంటే వండే ఓపిక లేనప్పుడు బయట ఫుడ్ ఆర్డర్ ఇచ్చేందుకు చాలా యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఏడేళ్ల బాలిక కొద్దిరోజుల క్రితం తన బామ్మ కోసం ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే నెట్ స్లోగా ఉండడం వలన ఆర్డర్ బుక్ కానట్టు తనకి చూపిస్తుంది. ఈ నేపథ్యంలో కన్ఫర్మేషన్ బటన్‌ను పదేపదే నొక్కింది
దీంతో అనేక ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి.
కాలింగ్ బెల్ మోగడంతో ఫుడ్ కోసం ఉత్సాహంగా డోర్ తీసిన ఆమెకు ఇంటి బయట 30 మంది డెలివరీ బాయ్స్ కనిపించారు. . 42 ఫుడ్ ఆర్డర్లను తెచ్చి ఆమె ముందు ఉంచారు.దీంతో వాటిని ఏం చేయాలో తెలియక బిక్క మొహం పెట్టింది. అయితే పొరుగింటి వారు బాలికకు సాయం చేసేందుకు ముందుకు వచ్చి వీలైన్నని ఆర్డర్స్ కొనుగోలు చేశారు. అయితే ఈ తతంగాన్నంతా సురెజ్ అనే మహిళ వీడియో తీసి తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా, చాలా మంది ఆ బాలిక విషయంలో ఔదార్యం కనబరుస్తున్నారు.