Vijay Deverakonda: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమాకు హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.
వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలి అని చిత్రబృందం భావిస్తున్నారు. ఇదిలా ఉంటే లైగర్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను 60 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని భారతీయ భాషల డిజిటల్ రైట్స్ ను అమెజాన్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కెరీర్లో ఇదే రికార్డు స్థాయిలో కుదిరిన డీల్ అని చెప్పవచ్చు. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సివుంది.
ఈ విషయంపై చిత్రబృందం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. అంతేకాకుండా ఈ సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ కాస్త డిఫరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాను తీసుకోవడానికి హిందీ బయ్యర్లు భారీ మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు. అందులో మొదటిది ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ కావడం, అలాగే బాలీవుడ్ పెద్ద నిర్మాత అయినా కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడంతో హిందీ ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.