విశాఖ గ్యాస్ దుర్ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అండ్ కో చేసిన యాగి అంతా ఇంతా కాదు. కోటి రూపాయాలిస్తే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అని ప్రభుత్వన్ని విమర్శించారు. గ్యాస్ లీకేజీ ఘటనకు ప్రభుత్వం నిర్లక్షమే కారణంగా చెప్పుకొచ్చారు. కంపెనీతో కుమ్మక్కై ప్రభుత్వం జనాల్ని మోసం చేస్తుందని ఆరోపించారు. జనావాసాల మధ్య రసాయన పరిశ్రమలు ఏంటి? అని అడ్డు అదుపు లేకుండా బాబు అండ్ కో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ సర్కార్ దుర్ఘటపై స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. ఘటన జరిగిన వెంటనే జగన్ రోడ్డు మార్గాన విశాఖ చేరుకుని బాధితుల్ని పరామర్శించారు.
తక్షణ సాయంగా మృతిడి కుటుంబానికి కోటి రూపాయలు, అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి 10 లక్షలు, ఇంకా కంపెనీ పరిసర గ్రామాలకు మనిషికి పదివేలు చొప్పున పరిహారం ఇచ్చారు. భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే నని..అందులో చింత చెందాల్సిన అసవరం లేదని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు కూల్ గా నిన్న విశాఖ బాధితుల్ని ఆర్చుకుని..తీర్చుకుని పరామర్శించారు. అయితే నేడు మహానాడు లో గ్యాస్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు చంద్రబాబు 50 వేలు సాయాన్ని ప్రకటించారు. అంతకు ముందు ఐదు నిమిషాలు మౌనం పాటించారు. సరిగ్గా చంద్రబాబు ఇక్కడే దొరికిపోయారు. కోటి ఇస్తే రాని ప్రాణాలు 50 వేలు ఇస్తే వచ్చేస్తాయా? లేక ఐదు నిమిషాల మౌనానికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చేస్తాయా? బాబు అంటూ పలువురు ఆయన తీరుని నిలదీస్తున్నారు.
అప్పుడు జగన్ కోటి ఇస్తే పచ్చ మీడియా సహాయంతో నానా రచ్చ చేసావ్? మరి ఇప్పుడు 50 వేలు సహాయాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేయారా? అంటూ వైకాపా ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి బాబు భలే దొరికిపోయారు. సోషల్ మీడియా అందుబాటులో లేని రోజుల్లో చంద్రబాబు రాజకీయం చెల్లింది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎక్కడ ఏం చేసినా..ఏం మాట్లాడినా అందులో తప్పులుంటే సోషల్ జనం ఎండగడుతున్నారు. ప్రస్తుతం బాబు గారిని నెటి జనులు అలాగే ఆడుకుంటున్నారు.