40 ఇయర్స్ ఇండస్ట్రీ స్కెచ్ మామూలుగా లేదు – పెద్ద ప్లానింగ్ ఇది !

cbn

 రాజకీయంలో అపార చాణిక్యుడు అనే పేరు సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు, ఏదైనా ప్లాన్ అమలు చేసాడంటే దాదాపుగా అందులో విజయం సాధించటం ఖాయమని అనేక సందర్భాల్లో రుజువైంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకున్న ఫలితాలు సాధించకపోయినా కానీ, కష్ట సమయాల్లో అనేక సార్లు ఆయన తెలివిగా బయటపడ్డాడంటే దానికి కారణం బాబు యొక్క వ్యూహాలు అనే చెప్పాలి. అందుకే టీడీపీ కేడర్ కూడా ఆయన మీద గట్టి నమ్మకాన్నే పెట్టుకుంటుంది.

cbn

 ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారిపోయింది. పార్టీ క్యాడర్ కూడా నిరసించి పోయింది. దీనితో గత 15 నెలల నుండి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తూ, అనేక ధర్నాలకు పిలుపునించిన కానీ పార్టీ శ్రేణులు పెద్దగా బయటకు రాలేదు. ఇదే సమయంలో అధికార వైసీపీ ఇంకా దూకుడు పెంచటంతో టీడీపీ పూర్తిగా డీలాపడింది.

 ఇలాంటి సమయంలోనే చంద్రబాబు అదిరిపోయే స్కెచ్ వేశాడు . నిమ్మగడ్డను ఉపయోగించి తన ప్లాన్ ను సక్సెస్ ఫుల్ గా అమలుచేశాడని రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట. వాస్తవానికి గత మార్చిలో నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించాల్సి ఉంది. కానీ వాటిని పక్కన పెట్టి పంచాయితీ ఎన్నికల నోటిఫికెషన్ విడుదల చేశాడు . దీనితో గ్రామ స్థాయిలోనే వర్గ పోరు మొదలైంది.

 అధికార పార్టీలోనే రెండు మూడు వర్గాలు చీలిపోతాయి. వాటిని క్యాష్ చేసుకుంటూ తదుపరి రాబోయే ఎన్నికలకు టీడీపీ సిద్దమైయే అవకాశం లభిస్తుంది. పంచాయితీ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ గా ఉంటున్న టీడీపీ శ్రేణులు ఒక్కసరిగా యాక్టీవ్ అయ్యారు, దైర్యంగా బయటకు వస్తున్నారు, నిజానికి చంద్రబాబుకు కూడా కావాల్సింది ఇదే, ఈ స్థాయిలో పార్టీ క్యాడర్ నుండి స్పందన వస్తే దానిని అదే విధంగా క్యారీ చేయటం బాబుకు పెద్ద కష్టమేమి కాదు.

 ఈ ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరులు విజయం సాధించిన, సాధించకపోయినా కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సాయంతో చంద్రబాబు వేసిన స్కెచ్ పార్టీకి లాభించిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న, క్యాడర్ భయపడకుండా రోడ్డు మీదకు రావడానికి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఉపయోగపడిందనే చెప్పాలి. చంద్రబాబు కూడా కోరుకుంది ఇదే కాబట్టి, ఈ విషయంలో చంద్రబాబు యొక్క 40 ఏళ్ల రాజకీయానుభవం బాగానే ఉపయోగపడింది.