2021-22 నవరత్నాల క్యాలెండర్ విడుదల… ఒక్కసారి లుక్కేయండి

navaratnalu

 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ నవరత్నాలు ప్రకటించాడు. సీఎం అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల్లో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో దానికి సంబధించిన క్యాలెండర్ విడుదల చేయటం జరిగింది.

navaratnalu

2021–22 నవరత్నాల క్యాలెండర్‌ అమలు ఇలా…

► ఏప్రిల్‌: వసతి దీవెన 15,56,956 మందికి లబ్ధి
► ఏప్రిల్, జూలై, డిసెంబర్, ఫిబ్రవరి: జగనన్న విద్యా దీవెన (సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌) 18,80,934 మందికి లబ్ధి
► ఏప్రిల్‌: రైతులకు వడ్డీ లేని రుణాలు (రబీ 2019, ఖరీఫ్‌ 2020) 66,11,382 మందికి లబ్ధి
► ఏప్రిల్‌: పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు – 90,37,255 మందికి లబ్ధి

► మే: 2020 ఖరీఫ్‌కి సంబంధించి పంటల బీమా చెల్లింపు
► మే, అక్టోబర్, జనవరి 2022: రైతు భరోసా (మూడు దఫాలుగా ), 54,00,300 మందికిపైగా రైతులకు ప్రయోజనం
► మే: మత్స్యకార భరోసా–1,09,231 మందికి లబ్ధి
► మే: మత్స్యకార భరోసా కింద డీజిల్‌ సబ్సిడీ చెల్లింపు, 19,746 మందికి లబ్ధి

► జూన్‌: జగనన్న విద్యా కానుక– 42,34,322 మందికి లబ్ధి
► జూన్‌: వైఎస్సార్‌ చేయూత– 24,55,534 మందికి లబ్ధి

► జూలై: వైఎస్సార్‌ వాహన మిత్ర– 2,74,015 మందికి లబ్ధి
► జూలై: కాపునేస్తం–3,27,862 మందికి లబ్ధి

► ఆగస్టు: రైతులకు వడ్డీ లేని రుణాలు (ఖరీఫ్‌ 2021కి సంబంధించి)– 25 లక్షల మందికి లబ్ధి
► ఆగస్టు: ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌ మిల్లులకు ఇన్సెంటివ్‌ల చెల్లింపు– 9,800 పరిశ్రమలకు ప్రయోజనం
► ఆగస్టు: నేతన్న నేస్తం– 81,703 మందికి లబ్ధి
► ఆగస్టు: అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు పరిహారం చెల్లింపు– 3,34,160 మందికి లబ్ధి

► సెప్టెంబర్‌: వైఎస్సార్‌ ఆసరా–87,74,674 మందికి లబ్ధి

► అక్టోబర్‌: జగనన్న తోడు– 9.05 లక్షల మందికి లబ్ధి
► అక్టోబర్‌: జగనన్న చేదోడు (దర్జీలు, నాయీబ్రాహ్మణులు, రజకులకు)– 2,98,428 మందికి లబ్ధి

► నవంబర్‌: ఈబీసీ నేస్తం (ఆర్థికంగా వెను కబడిన కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఇతర అగ్రవర్ణాల మహిళలకు ల బ్ధి. దాదాపు 6 లక్షలకుపైగా లబ్ధిదారులు)

► జనవరి (2022): అమ్మఒడి– 44,48,865 మందికి లబ్ధి