విజయ్ సైకిల్ మీదొచ్చి ఓటు వేయడానికి కారణం ఇదా !

Vijay went polling booth in bicycle

తమిళనాట ఎన్నికలు మొదలయ్యాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రజినీకాంత్, సూర్య, కార్తీ, ప్రభు, శివ కార్తికేయన్, అజిత్, కమల్ హాసన్, శృతి హాసన్, ఖుష్బు ఇలా స్టార్లు అందరూ పొద్దున్నే పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేస్తున్నారు. మరొక స్టార్ హీరో విజయ్ సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అయన కొంచెం భిన్నంగా ఆలోచించారు.

అందరిలా కార్లలో ఆయన పోలింగ్ బూత్ వద్దకు రాలేదు. ఇంటి నుండి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఆయన ఓటు వేశారు. ఉన్నట్టుండి రోడ్డు మీద ఆయన్ను చూసిన జనం పోలింగ్ బూత్ వరకు ఫాలో అయ్యారు. బూత్ వద్ద కూడ పెద్ద ఎత్తున ఆయన చుట్టూ చేరారు జనం. అయితే విజయ్ ఇలా సైకిల్ మీద రావడం వెనుక ఒక మెసేజ్ ఉందని అంటున్నారు కొందరు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయనే సందేశం ఇవ్వడం కోసమే విజయ్ ఇలా సైకిల్ మీద వచ్చారని, అంటే అది పరోక్షంగా పాలక వర్గం మీద వ్యతిరేకతను తెలియజేయడమేనని అంటున్నారు.