అతి తక్కువ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామలలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన ఈ భామ ప్రస్తుతం చిన్నా చితకా చిత్రాలలో నటిస్తుంది. వెంకటేష్, రవితేజ వంటి స్టార్స్ సరసన నటించిన కూడా పాయల్‌కు మంచి హిట్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ గట్టిగా ఫైట్ చేస్తున్న ఈ అమ్మడు ఫొటో షూట్స్‌తో మాత్రం నెటిజన్స్ మనసులు దోచుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పాయల్ రెగ్యులర్‌గా తనకు సంబంధించిన ఫొటోలని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూఏ ఉంటుంది.
సినిమా సంగతులు పక్కన పెట్టి పర్సనల్ విషయానికి వస్తే పాయల్ రాజ్‌పుత్.. సౌరబ్ దింగ్రా అనే వ్యక్తితో కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతుంది. అప్పట్లో ఒకసారి ఇతనిని పరిచయం చేసిన పాయల్ ఈ సారి అతనే నా లవర్ అంటూ కన్‌ఫాం చేసింది. డిసెంబర్ 5న పాయల్ రాజ్‌పుత్ బర్త్‌డే కావడంతో ఆమె ప్రియుడు సౌరబ్ దింగ్రా తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలని షేర్ చేస్తూ తన ప్రేమనంతా కురిపించాడు. ఈ ప్రపంచం మొత్తంలో నేనే చాలా అదృష్టవంతుడిని. నా చెంత సౌందర్య రాశి ఉంది. మబ్బుల తెరపై ప్రేమ లేఖ రాసి నా కున్న ప్రేమని వ్యక్తపరచాలని ఉంది. నా అదృష్టా రాశివి నువ్వు. నా ఏంజెల్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ సౌరబ్ తన ప్రేమని వ్యక్త పరిచాడు
సౌరబ్ పోస్ట్ చేసిన ట్వీట్‌ని పాయల్ రీ ట్వీట్ చేస్తూ ఎమోజీలని జత చేసింది. దీంతో అందరికి ఓ క్లారిటీ వచ్చింది. అయితే సౌరబ్.. పాయల్‌తో కలిసి దిగిన ఫొటోలని షేర్ చేయగా, ఇవి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం పాయల్‌రాజ్‌పుత్ తెలుగు ‘5.డబ్ల్యూ.ఎస్’ చిత్రంలో పోలీస్ ఆధికారిణి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు కరోనా పరీక్ష చేయించుకోగా, ఆ సమయంలో తాను ఎంత భయపడిందో అందుకు సంబంధించిన వీడియో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.